ఎల్బీనగర్లో విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. 11 కెవి విద్యుత్ వైర్లు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ పోల్ కింది భాగంలో విరిగి కింద పడటంతో కరెంటు పోల్ పై విద్యుత్ మరమ్మతులు చేస్తున్న నాగార్జున అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో మూడు బైకులు, ఒక ఆటో ధ్వంసం అయ్యాయి. నాణ్యత లోపంతో కరెంటు పోల్ విరిగిపడిందంటూ స్థానికులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.