వనస్థలిపురంలో ఆక్రమణల తొలగింపు

72చూసినవారు
వనస్థలిపురం రైతుబజారు కూడలి వద్ద ఆక్రమణలపై అధికారులు కొరడా ఝుళిపించారు. పూలు, పండ్ల వారు తోపుడు బండ్లు, షెడ్లను రోడ్డుపై వరకు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తుండడం, అక్కడికి వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. బుధవారం జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించారు.

సంబంధిత పోస్ట్