స్వాతంత్ర్య సమరయోధుల జీవితం అందరికీ ఆదర్శం

82చూసినవారు
స్వాతంత్ర్య సమరయోధుల జీవితం అందరికీ ఆదర్శం
స్వాతంత్ర్య సమరయోధుల జీవితం అందరికి ఆదర్శమని వరల్డ్ బుక్ రికార్డ్ హోల్డర్, ప్రముఖ కళాకారులు, సోషల్ వర్కర్ పెండెం కృష్ణ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం కొత్తపేట బాబు జగ్జీవన్ రాం భవన్‌కు బాబు జగ్జీవన్ చిత్రపటం, జాతీయ నాయకుల చిత్రపటాలతో పాటు పలు సామాగ్రిని అందజేశారు. ఈ నెల 5వ తేదీన జరగబోయే బాబు జగ్జీవన్ రామ్ జయంతి నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జి బి. రాజు, ఎం. శేఖర్ రెడ్డి, దేవేందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్