సీఎం సహాయ నిధి పథకాన్ని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే పి. సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమా వేశం హాల్లో 99 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. సీఎంఆర్ ఎఫ్ పేదల కు వరంలాంటిదన్నారు. పేదలకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకునేందుకు సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.