మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ లోని శ్రీ విద్యాటౌన్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులను బుధవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.