మీర్ పేట్ కార్పొరేషన్ పరిధి మంత్రాల చెరువు సుందరీకరణలో భాగంగా 1 కోటి రూపాయల హెచ్ఎండీఏ నిధులతో ఏర్పాటు చేసిన లైట్లను బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. చెరువులను రక్షించడంతో పాటు సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదం పంచేలా ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి చేసిన చెరువులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజలపై ఉందన్నారు.