ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే

61చూసినవారు
ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే
రెండురోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎస్ఆర్ సూచించారు. సోమవారం తుక్కుగూడలో ఆయన మాట్లాడుతూ తమ సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలను అధికారులు గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రజలకు అంటువ్యాధులు వ్యాపించకుండా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మున్సిపల్, వైద్య సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్