తలకొండపల్లి చౌరస్తా వద్ద గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని గురువారం గిరిజన సంఘాల నాయకులు తహసీల్దార్ నాగార్జునకు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ప్రజాప్రతినిధులు రోడ్డు విస్తరణ అనంతరం విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఈ విషయంపై స్పందించి విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని వారు కోరారు.