పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏడాదికి పదివేల రూపాయలకు పెంచడాన్ని హర్షిస్తూ గురువారం తలకొండపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని వెల్జాల్ గ్రామంలో రైతులు, బీజేపీ నాయకులు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన సంవత్సర కానుకగా సమ్మాన్ నిధిని పెంచి ప్రధాని మోడీ రైతుల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి గౌడ్, పాండు ప్రసాద్, బక్కి కుమార్ రైతులు పాల్గొన్నారు.