తలకొండపల్లి: ఆలయ రహదారికి మరమ్మతులు చేయించిన దాత

81చూసినవారు
తలకొండపల్లి: ఆలయ రహదారికి మరమ్మతులు చేయించిన దాత
తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలోని బండలగడ్డ ఆంజనేయస్వామి ఆలయ రహదారి వర్షాలకు అద్వానంగా మారి గుంతల మయంగా తయారైనది. దీంతో ఆలయానికి విచ్చేసి భక్తులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు జినుకుంట్ల భాస్కర్ తన సొంత నిధులతో బుధవారం రోడ్డుపై మట్టి పోయించి చదును చేయించారు. అనంతరం ఆలయ రహదారిపై వీధిలైట్లు ఏర్పాటు చేయించారు.

సంబంధిత పోస్ట్