ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే
మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం సర్కారు దవాఖానను ఆయన సందర్శించి రోగులు, వైద్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పన, రోగులకు నాణ్యతో కూడిన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్