మహిళా మండలి కమ్యూనిటీ హాల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులను రిమాండ్ కు తరలించిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్ కాలనీలోని మహిళా మండలి కమ్యూనిటీ హాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీ సులు సోమవారం దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.