బోడుప్పల్‌: బండరాయితో మోది భార్యను హత్య చేసిన భర్త

60చూసినవారు
బోడుప్పల్‌: బండరాయితో మోది భార్యను హత్య చేసిన భర్త
బండరాయితో మోది భార్యను భర్త హత్య చేశాడు. బోడుప్పల్‌ టెలిఫోన్‌ కాలనీకి చెందిన నిహారిక(35)కు ఖమ్మం జిల్లా తిరుమలపాలెం కాకరకు చెందిన శ్రీకర్‌రెడ్డి(40)తో 2017లో పెళ్లి జరిగింది. వివాహం సందర్భంగా నిహారిక తల్లిదండ్రులు ఓ ఇల్లు కొనిచ్చారు. తన పుట్టింటి వారిచ్చిన ఇల్లు అని ఆమె నిత్యం గుర్తు చేస్తుండేది. ఈ క్రమంలో దంపతుల మధ్య మంగళవారం మాటామాటా పెరిగింది. క్షణికావేశంలో బండరాయితో నిహారిక తలపై మోది హత్య చేశాడు.

సంబంధిత పోస్ట్