తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని, సన్నిహితుడిని కోల్పోయానని ఆవేదన చెందారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని సీఎం అన్నారు. వారి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.