నూతన సీసీ రోడ్ల పరిశీలన

81చూసినవారు
నూతన సీసీ రోడ్ల పరిశీలన
శంషాబాద్ లోని 6వ వార్డులో అస్తవ్యస్తంగా ఉన్న పాతగొల్లపల్లి రోడ్డు నుంచి ఖాజీగల్లీ వరకు కౌన్సిలర్ వై. కుమార్ చొరవతో రోడ్డు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. 30 లక్షలతో ఈ రోడ్డు పనులను చేపడుతున్నారు. రోడ్డు పనులను మున్సిపల్ చైర్పర్సన్ సుష్మతో కలిసి కౌన్సిలర్ వై. కుమార్ పరిశీలించారు. ఆరో వార్డులో అన్ని బస్తీల్లో సీసీరోడ్డు పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :