మహాత్మా జ్యోతీరావు పూలే వర్థంతి సందర్భంగా గురువారం రంగారెడ్డి జిల్లా పద్మశాలి యవజన సంఘం అధ్యక్షులు కొంపల్లి జగదీష్ రాజేంద్రనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం, మహిళల విద్య, అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడని పేర్కొన్నారు.