రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఆదర్శ కాలనీలోని 60 ఫీట్ల రహదారిపై వీధి దీపాల లేమితో కార్మికులు మరియు వాహనదారులు రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శనివారం నవయువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి పేర్కొన్నారు. ఈ మార్గంలో మధుబన్ కాలనీ, శ్రీరామ్ కాలనీ, పద్మశాలి పురం ప్రాంతాల కార్మికులు, ప్రయాణీకులు ప్రతిరోజు ప్రయాణం చేస్తూ తమ సమస్యలను వ్యక్తం చేస్తున్నారు