రాజేంద్రనగర్ కిస్మత్పూర్ లోని ఓం నగర్ కాలనీ సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఓం నగర్ కాలనీ ప్రెసిడెంట్ మన్నె నవీన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆట పాటలతో సద్దుల బతుకమ్మ జరుపుకున్నారు. అలాగే కాలనీలో టీ జంక్షన్ లో కూడా మహిళలు బతుకమ్మ ఆడి పాడి ఘనంగా జరుపుకున్నారు.