రాష్ట్రంలో ఎక్కడ మట్టి రోడ్డు అన్నదే లేకుండా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులు నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం చిలుకూరు-తంగడపల్లి రోడ్డులో గల గుంతలను అమెరికన్ టెక్నాలజీ మిషనరీతో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల నుండి మండలాలకు ప్రతి తండాలలో కూడా సిసి రోడ్లు వేయుటకు టెండర్లను పిలవడం జరిగిందని, పనులు రెండు నెలల్లో ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.