సంధ్య థియేటర్ ఘటనకు నేషనల్ మీడియా సంస్థలు మద్దతిస్తున్నట్టుగా ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అసహనం వెలిబుచ్చారు. అయితే తన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. దీనిపై గురువారం ఓ నెటిజన్ స్పందిస్తూ చేసిన తప్పును అంగీకరించడం గొప్ప విషయమని, అదే మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టిందంటూ సీవీ ఆనంద్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.