రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నేత పులిమామిడి రాజేష్ గౌడ్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిర్వహించిన పడిపూజకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు, పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.