షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను చూసినప్పుడల్లా మనసు బాధగా ఉండేదని, కనీసం సున్నం వేయించేవారు కూడా ఉండేవారు కాదని, ప్రస్తుతం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ గొప్ప కార్యక్రమానికి పూనుకోవడంతో ఈ కళాశాల బాగుపడాలన్న తన కల నెరవేరిందని కాంగ్రెస్ నేత మొహమ్మద్ ఇబ్రహీం అన్నారు. కళాశాల నిర్మాణానికి ఆయన రూ. లక్ష 16 వేల చెక్కును సోమవారం ఎమ్మెల్యేకు అందించారు.