షాద్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇటీవల కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే దాతల సహాయంతో ఈ కళాశాలను నిర్మించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శాలువాతో సన్మానించారు.