షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు స్థానిక మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, సీనియర్ జర్నలిస్ట్ కేపీ, రంగనాథ్ తదితరులను కమిటీ నిర్వాహకులు ఆహ్వానించారు. సోమవారం శ్రీ వీరాంజనేయ స్వామి కమిటీ కార్యనిర్వాహకులు పిల్లి శేఖర్, కుడుముల శివ, చెరుకు శివ, వీరేశం, అప్ప లక్ష్మి నరసింహ, యాదిరెడ్డి, మల్లేష్, తదితరులు కరపత్రాలతో ప్రముఖులను ఆహ్వానించారు.