అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు పార్టీ మారిన షాద్ నగర్ పట్టణ యువ నాయకుడు మధు బీఆర్ఎస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెస్ నటరాజన్ కు వాట్సాప్ ద్వారా సమాచారం తెలియజేసినట్లు చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా గతంలో రాజకీయంగా సుదీర్ఘ సేవలు అందించారు.