వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు భద్రత పెంపు

77చూసినవారు
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు భద్రత పెంపు
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌కు హోంశాఖ భద్రతను పెంచింది. కలెక్టర్కు అదనంగా ఇద్దరు ఏఆర్ గన్మెన్లను శనివారం కేటాయించింది. లగచర్ల దాడి కేసులో మరో నలుగురికి కోర్టు రిమాండ్ విధించడంతో మొత్తం 25 మంది రిమాండ్ లో ఉన్నారు. ఈకేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న శాంతిభద్రతల అదనపు డీజీ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. అలాగే మరి కొంతమందిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్