బీజేపీ చీఫ్‌పై అత్యాచార కేసు నమోదు

85చూసినవారు
బీజేపీ చీఫ్‌పై అత్యాచార కేసు నమోదు
హర్యానా బీజేపీ చీఫ్, గాయకుడు రాఖీ మిట్టల్‌పై ఢిల్లీకి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం.. నటిగా అవకాశం ఇస్తామని చెప్పి ఆమెను ప్రలోభపెట్టారని, బలవంతంగా మద్యం తాగించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ విషయం బయటకు చెప్పవద్దని బెదిరించడంతో పాటు, ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు తీసుకున్నారని పోలీసులకు వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్