రషీద్ ఖాన్ బెస్ట్ బౌలర్: సూర్య

66చూసినవారు
రషీద్ ఖాన్ బెస్ట్ బౌలర్: సూర్య
ప్రపంచంలో రషీద్ ఖాన్ అత్యుత్తమ బౌలర్ అని టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘గతంలోనూ నేను ఇదే మాట చెప్పా. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ను అర్థం చేసుకుని ఆడటం చాలా కష్టం. అతడు బౌలింగ్‌కు వచ్చాడంటే ఎలాంటి షాట్లు కొట్టాలనేది ముందే అనుకుంటా. కానీ, ఒక్కోసారి అది విఫలమయ్యే ప్రమాదం ఉంది. అతడిపై ఆధిపత్యం ప్రదర్శించడం సులువేం కాదు.’’ అని సూర్య తెలిపాడు.

సంబంధిత పోస్ట్