బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో అరెస్టైన తెలుగు సినీ నటి హేమకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై విచారణ జరిపిన బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత నెల మే 19న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున మత్తుపదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.