భారత దేశ ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు కంటే అత్యధిక ఓట్లను కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి పొందారు. తన కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రావి నారాయణ రెడ్డిని జవహార్‌లాల్ నెహ్రు అభినందించారని ఆ తరం నేతలు గుర్తు చేసుకుంటారు. కాగా, పీడీఎఫ్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన రావి నారాయణ రెడ్డికి 3,09, 162 ఓట్లు వచ్చాయి. ఆనాడు ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రుకు 2,33, 571 ఓట్లు మాత్రమే వచ్చాయి.