రికార్డు స్థాయిలో BMW విక్రయాలు
దేశంలో గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో (జనవరి-జూన్) వాహనాలను విక్రయించినట్లు BMW గ్రూప్ ఇండియా వెల్లడించింది. 2024 తొలి 6 నెలల్లో మొత్తం 7,098 వాహనాలను వినియోగదార్లకు డెలివరీ ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది. 2023 జనవరి-జూన్ మధ్య విక్రయించిన 5,867 వాహనాలతో పోలిస్తే ఇవి 21% అధికం. 3,614 BMW మోటోరాడ్ మోటార్ సైకిల్స్‌ను విక్రయించింది.