నీలి రంగులో కనిపించే సముద్ర జలాలు ఆకుపచ్చ రంగులోకి మారుతున్నాయి. మానవ కంటికి కనిపించని ఈ మార్పు, సముద్ర పర్యావరణ వ్యవస్థలో అత్యంత నిగూఢంగా జరుగుతోందని పరిశోధకులు గుర్తించారు. భూమిపై మహా సముద్రాల రంగులో గణనీయమైన మార్పు వచ్చిందని బ్రిటన్‌కు చెందిన ‘నేషనల్ ఒషియోనోగ్రఫీ సెంటర్’ పరిశోధకులు తేల్చారు. గ్లోబల్ కార్బన్ సైకిల్, సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఏర్పడ్డ మార్పులే దీనికి కారణమని పేర్కొన్నారు.