పొగ తాగే వారి సంఖ్యను 2050 నాటికి ప్రస్తుత రేట్లలో 5 శాతం మేర తగ్గించగలిగితే మగవారిలో ఒక ఏడాది, ఆడవారిలో 0.2 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని ఇటీవల జరిపిన ఓ కొత్త అధ్యయనంలో తేలింది. దాని ప్రకారం.. 2023లో ధూమపానం నిర్మూలించబడితే 2050లో మగవారిలో 1.5 సంవత్సరాలు, ఆడవారిలో 0.4 ఏళ్ల వరకు ఆయుర్దాయం పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. 2021లో 10 మరణాల్లో ఒకటి ధూమపానం వల్లే సంభవించిందని చెప్పారు.