రోజూరోజుకి యువతకు సోషల్ మీడియా కోసం వీడియోల పిచ్చి ముదురుతోంది. తాజాగా అమెరికా నెబ్రస్కాలో ఓ 17 ఏళ్ల కుర్రాడు సోషల్ మీడియా వీడియో కోసం ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. రైలు మార్గాలను నిర్దేశించే స్విచ్ల లాక్ తీసి మార్పులు చేశాడు. దీంతో రెండు లోకోమోటీవ్‌లు పట్టాలు తప్పగా ఆ వీడియోను వైరల్ చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు యువకుడిదే నిర్వాకమని గుర్తించి కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.