మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు అమరావతి హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జునపై నమోదు అయిన అత్యాచారం కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమోదైన అత్యాచారం కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి నాగార్జున హైకోర్టులో ఇటీవల క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, కేసును క్వాష్ చేస్తూ తీర్పు వెల్లడించింది.