తెలంగాణ విద్యార్థులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. స్థానిక కోటా విషయంలో ఒక్కసారికి మినహాయింపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణకు ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని సూచించింది.