దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట

71చూసినవారు
దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట
దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట లభించింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికపై ఏడుగురు పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పోలీసులు, షాద్‌నగర్‌ తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక ఇవ్వడంతో.. ఆ నివేదిక సరిగ్గా లేదని పోలీసులు హైకోర్టుకు వెళ్లారు.

సంబంధిత పోస్ట్