బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని, బంగ్లాదేశ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు సుమారు 16 మంది మృతి చెందినట్లు రాయిటర్స్ నివేదించింది. అలాగే పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు వెల్లడించింది.