గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై కఠినంగా వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పదేళ్లలో BRS ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని తప్పుడు ప్రకటన చేయడం హాస్యాస్పదని చెప్పారు. తాము 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతకు మొండిచేయి చూపించారని ట్వీట్ చేశారు.