ఆర్థిక మంత్రిగా, సీఎంగా, గవర్నర్ గా 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని CM రేవంత్ కొనియాడారు. సమస్యలను పరిష్కరించడానికి సీఎంలకు కుడిభుజంగా రోశయ్య ఉండేవారని చెప్పారు. చట్ట సభల్లో రోశయ్య వ్యవహరించిన తీరుతెన్నులను ఈ సందర్భంగా సీఎం స్మరించుకుంటూ చట్ట సభల్లో ఆనాటి స్ఫూర్తి కొరవడిందని అన్నారు. రోశయ్య పాలక పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాటల చతురతతో విషయావగాహనతో మాట్లాడేవారని గుర్తుచేశారు.