‘టైటానిక్‌’ సరసన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

577చూసినవారు
‘టైటానిక్‌’ సరసన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’
RRR చిత్రం మరో అరుదైన ఘనతను అందుకుంది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డు వేడుకల్లోనూ తళుక్కుమంది. సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలు రూపొందించే స్టంట్‌మాస్టర్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ.. డాల్బీ థియేటర్‌లో ఒక వీడియోని ప్రదర్శించారు. అందులో హరాల్డ్‌ లాయిడ్‌, టైటానిక్‌, మిషన్‌ ఇంపాజిబుల్‌ లాంటి చిత్రాల్లోని సన్నివేశాలతోపాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని యాక్షన్‌ సీన్లను జత చేశారు. అలాగే ‘విక్‌డ్‌’ విభాగంలో ‘నాటు నాటు’ పాటని ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్