ఐఐటీ మద్రాస్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి జాక్‌పాట్ కొట్టాడు. గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ IIT 2025 బ్యాచ్ విద్యార్థుల కోసం బేస్, ఫిక్స్‌డ్ బోనస్ & రీలొకేషన్ వంటి వాటితో సహా మొత్తం రూ. 4.3 కోట్లకు పైగా అత్యధిక వేతన ఆఫర్‌ను అందించింది. ఈ ఆఫర్‌ను ఐఐటీ విద్యార్థి సొంతం చేసుకున్నారు. అతని పేరు వెల్లడించలేదు. బ్లాక్‌రాక్, గ్లీన్ & డావిన్సీ వంటి సంస్థలు రూ.2 కోట్ల కంటే ఎక్కువ ప్యాకేజీలను అందించాయి.