ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి

58చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి
TG: జగిత్యాల జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్‌పల్లి పట్టణ శివారులో చోటు చేసుకుంది. మెట్‌పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు సుబ్బరాజు జగిత్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సుబ్బరాజు ఓ హోటల్‌లో టిఫిన్‌ తీసుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు సుబ్బరాజు బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్