17 పాఠశాలల బస్సులను సీజ్ చేసిన ఆర్టీఓ అధికారులు

53చూసినవారు
17 పాఠశాలల బస్సులను సీజ్ చేసిన ఆర్టీఓ అధికారులు
హైదరాబాద్ జిల్లాలో 17 పాఠశాలల బస్సులను సీజ్ చేశామని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ రమేష్ తెలిపారు. అందులో పది బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,290 బడి బస్సులుండగా 923 బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారని ఇంకా 367 బస్సులకు ఫిట్​నెస్ చేయించుకోలేదన్నారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డెక్కే బస్సులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్