పిల్లాడిని ఎత్తుకెళ్లిన రుద్రాణి.. దీప వడ్డీ డబ్బులు కడుతుందా?

18583చూసినవారు
పిల్లాడిని ఎత్తుకెళ్లిన రుద్రాణి.. దీప వడ్డీ డబ్బులు కడుతుందా?
కార్తీకదీపం సీరియల్ 1256వ ఎపిసోడ్‌ లోకి అడుగుపెట్టింది. హోటల్ కి వచ్చిన సౌందర్య, ఆనందరావులు కాఫీ తాగి చాలా బాగుంది అని అంటారు. అప్పారావుతో సరదాగా మాట్లాడతారు.

అప్పుడే అప్పారావు తన ఫోన్ తీసి మోనితతో తీసుకున్న సెల్ఫీని చూపిస్తాడు. సౌందర్య ఆ ఫొటోని ఆనందరావుకి చూపించి కాఫీకి డబ్బులు ఇచ్చేసి ‘చిల్లర నువ్వే ఉంచుకో అప్పారావు’ అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ‘సౌందర్య ఎందుకు ఆ కంగారు’ అంటాడు ఆనందరావు. ‘మోనితకి సంబంధించిన విషయాలేవి మీరు వినొద్దు, చూడొద్దు అంతే’ అంటూ భర్తని తీసుకుని వెళ్లిపోతుంది.

ఇక సీన్ కట్ చేస్తే.. మహాలక్ష్మి బాబుని తీసుకొచ్చి దీపకు ఇస్తుంది. మీరు ఆ రుద్రాణి సమస్య నుంచి తొందరగా బయటపడితే బెటర్ అంటూ బాబుని అప్పగించి వెళ్లిపోతుంది. దీప ‘నాన్నాఆనంద్‌ నువ్వు బొజ్జో.. నేను ఇప్పుడే వస్తాను’ అంటూ బయటికి వెళ్తుంది. మరోవైపు కార్తీక్ అప్పారావుతో.. ‘నాకు సెలవు కావాలి అప్పారావు ఓనర్‌కి చెబుతావా?’ అంటాడు. కడుపు నొప్పి వచ్చి వెళ్లిపోయావని చెప్తా అని కార్తీక్‌ని ఇంటికి పంపిస్తాడు. ఇక సౌందర్య, ఆనందరావులు వెళ్తూ వెళ్తూ కాఫీ గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరూ ఒకేసారి ‘ఆ కాఫీ మన వంటలక్క దీప పెట్టినట్లే ఉంది కదా’ అని అనుకుని వెంటనే హోటల్‌కి తిరిగి బయలుదేరతారు.

సీన్ కట్ చేస్తే పిల్లిగడ్డం రౌడీ బాబు(ఆనంద్)ని రుద్రాణి ఇంటి దగ్గర ఊయల్లో వేసి ఊపుతూ ఆడిస్తూ ఉంటాడు. దీప గేట్ తోసుకుంటూ ‘రుద్రాణీ’ అని అరుస్తూ వస్తుంది. నీకు డబ్బులు ఇస్తాం అన్నాం.. అయినా బాబుని ఎత్తుకొచ్చావ్ అంటూ దీప కోప్పడుతుంది. వడ్డీ తీసుకొచ్చి బాబును తీసుకెళ్లు అని అంటుంది రుద్రాణి. వడ్డీ డబ్బులు తీసుకొస్తానంటూ దీప మౌనంగా వెనుదిరుగుతుంది.

సౌందర్య, ఆనందరావులు హోటల్‌కి వెళ్తారు. ఇక్కడ కాఫీ కలిపింది ఎవరో చెబుతారా అని ఓనర్ ని అడుగుతారు. కానీ ఆ ఓనర్‌కి దీప గతంలో తాను ఇక్కడ పని చేస్తున్నట్లు ఆ రుద్రాణికి తెలియకుండా ఉంటే చాలు అన్న విషయం గుర్తొచ్చి ‘సాంబయ్య మేడమ్’ అని అబద్ధం చెబుతాడు.

ఇక కార్తీక్ ఓ కూరగాయల వ్యక్తి దగ్గరకు వెళ్లి.. ‘నాకో సాయం కావాలి.. నువ్వు ఆ ఆశ్రమంలో కూరగాయలు అమ్ముతావు కదా.. అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతుల వివరాలు కావాలి’ అంటాడు. ‘అలా చెప్పకూడదు సార్ సారీ సార్’ అంటాడు ఆ కూరగాయలు అమ్మేవాడు. ఇక దీప రంగరాజు అలియాస్ ఆనంద్(మోనిత కొడుకు) గురించి ఇంట్లో ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. మరిన్ని వివరాలు తరువాయి ఎపిసోడ్ లో చూడాలి.
Job Suitcase

Jobs near you