నాటో దేశాలపై రష్యా దాడి చేయదు: పుతిన్

56చూసినవారు
నాటో దేశాలపై రష్యా దాడి చేయదు: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేయదని ఆ దేశ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ దేశాలపై రష్యా దాడి చేస్తుందని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. 'తాము నాటో దేశాలపై దాడి చేయం, కానీ.. ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే మాత్రం వాటిని కూల్చేస్తాం' అని పుతిన్ స్పష్టం చేశారు. పొరుగు దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్నా అమెరికా కోసం ఆ దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్