బిడ్డ కోసం పావురం ప్రాణత్యాగం (వీడియో)

62చూసినవారు
తల్లి తన బిడ్డల కోసం అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి కూడా వెనుకాడదు. తల్లి ప్రేమ మనుషులలోనే కాకుండా, జంతువులు, పక్షులలో కూడా ఒకేలా ఉంటుంది. ఇదే కోవలో ఓ పావురం అప్పుడే పుట్టిన తన పిల్ల కోసం ప్రాణత్యాగం చేసింది. నార్త్ ఇండియాలో విపరీతమైన ఎండలు ఉన్న విషయం తెలిసిందే. ఎండ తన బిడ్డకు తగలకుండా తన రెక్కల్లో పావురం ఉంచింది. అయితే ఎండకు తల్లి పావురం చనిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్