తెలంగాణలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మధ్యాహ్నం 12 గం.కు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. పాలిసెట్ పరీక్షను మే 24న జరిగింది. ఈ పరీక్షకు మొత్తంగా 92,808 విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 82,809 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల కోసం https://sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.