డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టి.. రెండు స్పెషల్ ఆపరేషన్లలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. 150 సబ్బు పెట్టెలలో రవాణా చేస్తున్న రూ.9.5 కోట్ల విలువైన డ్రగ్స్ (1.9 కిలోల హెరాయిన్)ను స్వాధీనం చేసుకున్నారు. అస్సాంలోని కాచర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు శనివారం రెండు స్పెషల్ ఆపరేషన్లను పోలీసులు చేపట్టారు.