ఇద్దరిని ఢీకొట్టిన కారు.. ఎగిరిపడ్డారు (వీడియో)

60చూసినవారు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో మే 31న షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై ముగ్గురు మాట్లాడుకుంటుండగా ఓ కారు మెరుపు వేగంతో దూసుకొచ్చింది. ఇద్దరిని కారు డ్రైవర్ ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాద తీవ్రతకు బాధితులు ఇద్దరూ గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్